శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (06:55 IST)

మునుగోడు పోరులో తెరాసదే గెలుపు... బీజేపీ చిత్తు

trs victory
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థి విజయం సాధించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగించిన ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామమాత్రంగా నిలిచారు. 
 
ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి తెరాస అభ్యర్థికి 11,666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 14వ రౌండ్ ముగిసే సమయానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన పాల్వాయి స్రవంతికి 21,243 ఓట్లు వచ్చాయి. 
 
14వ రౌండ్‌లో కూసుకుంట్లకు ఏకంగా 6,608 ఓట్ల, రాజగోపాల్ రెడ్డికి 5,553 ఓట్లు, లభించాయి. అంటే ఈ రౌండ్‌లో కూడా తెరాసకు 1,055 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా, 2,3 రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలో తెరాస అభ్యర్థే అధిక్యాన్ని కనపరిచాడు.