శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (10:34 IST)

రాకేష్ డెడ్ బాడీతో భారీ నిరసనలకు టీఆర్ఎస్ ప్లాన్

Rakesh
Rakesh
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మకంగా మారింది. నిరసనకారులు విధ్వంసానికి దిగగా.. రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్‌లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. 
 
సికింద్రాబాద్ ఆందోళన, కాల్పుల ఘటనకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ది వరంగల్ జిల్లా. దీంతో వరంగల్ జిల్లాలో భారీ నిరసనలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 
 
ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్జి పిలుపునిచ్చారు. ఇక రాకేష్ డెడ్ బాడీతో నర్యంపేటలో భారీ ర్యాలీ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేట మీదుగా రాకేష్ స్వగ్రామం దబీల్ పురా వరకు ర్యాలీ తీయడానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
 
సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నర్సంపేట బంద్ కు ఎమ్మెల్యే పెద్ది పిలుపిచ్చారని తెలుస్తోంది. అధికార పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉదయాన్నే ఎంజీఎంకు వచ్చి రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించారు.  
 
రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు.