సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (14:35 IST)

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ విద్యార్థులకు ముఖ్య గమనిక

ts eamcet
తెలంగాణ రాష్ట్రంలోని ఎంసెట్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని కల్పించింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న వారు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునేవారు తక్షణం స్పాట్ అడ్మిషన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలిపింది. 
 
ఇందులోభాగంగా, అక్టోబరు 31వ తేదీన ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. నవంబరు 3వ తేదీన స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ కింద కేటాయించడం జరుగుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. 
 
అయితే, స్పాట్ అడ్మిషన్ల కోసం వచ్చే అభ్యర్థులు తప్పనిసరంగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని కోరింది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్లను సంబంధిత అభ్యర్థికి అందజేస్తారు. కాగా, ఈ నెల 25వ తేదీన ఎంసెట్ తుది కౌన్సెలింగ్ ముగిసిన విషయం తెల్సిందే.