మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (13:01 IST)

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య - మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

ktramarao
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టాల్సిన ఖమ్మం జిల్లా పర్యటన రద్దు అయింది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక పోలీసులే కారణం అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
నిజానికి మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మంలో పర్యటించాల్సివుంటుంది. ఈ-కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సోమవారం జరగాల్సివుంది. ఈ కారణాల కారణంగానే మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దు అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.