శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (17:41 IST)

అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టొద్దు.. రేవంత్

revanth reddy
తాము అభివృద్ధికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, కానీ, అభివృద్ధి పేరిట పచ్చని పొలాల్లో చిచ్చుమాత్రం పెట్టొద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి తెలంగాణా వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, శనివారం వరంగల్ జిల్లాలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆయనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. 
 
తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకున్న రైతుల కష్టాలను ఆయన తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. జయశంకర్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. 
 
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కోసం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణకు సిద్ధమైందని విమర్శించారు. అదేసమయంలో తాము అభివృద్ధికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. కానీ, అభివృద్ధి పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టొద్దని ఆయన కోరారు. అలాగే అనేక అంశాలను రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.