సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (19:52 IST)

ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ విద్యా సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్

students
తెలంగాణ ఇంటర్మీడియెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది ఈ విద్యా సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌ వర్తింప జేయాలని నిర్ణయించినట్టు ఇంటర్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
 
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు 70 శాతం సిలబస్‌ను మాత్రమే విద్యాశాఖ అమలు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు, సీబీఎస్‌ఈ నిర్ణయం మేరకు 2021-22 విద్యా సంవత్సరంలో ఇదే విధానాన్ని అమలు చేశారు. 2022-23లోనూ 70 శాతం సిలబస్‌ను మాత్రమే ఖరారు చేశారు. 
 
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 100 శాతం సిలబస్‌ను అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. 2023లో నిర్వహించే వార్షిక పరీక్షను వందశాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో ప్రశ్నల్లో చాయిస్‌ 50 నుంచి 70 శాతం ఇచ్చారు.