శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (13:53 IST)

ఏసీ బస్సుల్లో ఇకపై స్నాక్స్-రూ.30లకు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్

Snack Box
Snack Box
ఏసీ బస్సుల్లో ఇకపై స్నాక్స్ కూడా అందుబాటులో వుంటాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి బస్‌ టికెట్‌ తో పాటే 'స్నాక్‌ బాక్స్‌'ను ఇవ్వాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ గరుడ బస్సుల్లో స్నాక్‌ బాక్స్‌ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. 
 
ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది.
 
ఈ స్నాక్‌ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.