బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:42 IST)

హైదరాబాద్‌లో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు

Green Metro Luxury AC buses
Green Metro Luxury AC buses
హైదరాబాద్ నగరంలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నడపనున్నారు. బుధవారం నుంచి పర్యావరణ అనుకూల బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించనున్నారు.
 
గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పర్యావరణహిత బస్సుల సంఖ్యను పెంచే దిశగా టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి దశగా 25 బస్సులు రానున్నాయి. 
 
బుధవారం గచ్చిబౌలి స్టేడియం సమీపంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎండీ సజ్జనార్‌తో కలిసి ఈ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెదజల్లవు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 225 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం లభిస్తుంది. 
 
3 నుండి 4 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, క్యాబిన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, సెలూన్, ఒక నెల బ్యాకప్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ 12 మీటర్ల పొడవైన ఆకుపచ్చ లగ్జరీ AC బస్సులు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి.