శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (16:31 IST)

జిహెచ్ఎమ్‌సి వాట్సప్ గ్రూపులో నీలి చిత్రాలు... పంపిందెవరంటే?

ఈమధ్య కాలంలో చేతిలోకి ఇంటర్నెట్ వచ్చాక ఏదిబడితే అది చూడటం, కొన్ని ఫోటోలను డౌన్లోడ్ చేసుకోవడం మామూలైంది. బూతు బొమ్మలు, నీలి చిత్రాలను చూసేవారి గురించి ఇక చెప్పేదేముంది. నెట్ ఉచితం... డౌన్లోడ్ చేసేందుకు పైసా ఖర్చు ఉండదు కనుక ఏదిబడితే అది డౌన్లోడ్ చేసుక

ఈమధ్య కాలంలో చేతిలోకి ఇంటర్నెట్ వచ్చాక ఏదిబడితే అది చూడటం, కొన్ని ఫోటోలను డౌన్లోడ్ చేసుకోవడం మామూలైంది. బూతు బొమ్మలు, నీలి చిత్రాలను చూసేవారి గురించి ఇక చెప్పేదేముంది. నెట్ ఉచితం... డౌన్లోడ్ చేసేందుకు పైసా ఖర్చు ఉండదు కనుక ఏదిబడితే అది డౌన్లోడ్ చేసుకుని స్టోర్ చేసేసుకుంటున్నారు. దాదాపు ఇలాంటి ఘటనే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వాట్సప్ ఖాతాలో వెలుగుచూసింది. 
 
ఈ గ్రూపు ఖాతాలోకి అకస్మాత్తుగా నీలి చిత్రాలు దర్శనమిచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి దూసుకొచ్చాయి. వీటిని చూసిన మహిళా కార్పొరేటర్లు అవాక్కయ్యారు. వాటిని షేర్ చేసింది ఎవరా అని ఆరా తీస్తే వెంగళరావు నగర్ డివిజన్ కిలారి మనోహర్ వాట్స్ యాప్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 
 
దీనితో సదరు కార్పొరేటర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళా కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ పని ఆ కార్పొరేటర్ చేసిందా లేదంటే డ్రగ్స్ వ్యవహారంలోలా ఫోను తనవద్ద లేదు... తన డ్రైవర్ వద్ద వుందని ఆయన చెప్తారా చూడాల్సి వుంది.