శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత - ఎయిమ్స్‌లో అడ్మిట్

kishan reddy
కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పిగాను, అస్వస్థతగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. 
 
ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియోన్యూరో సెంటర్‌ల పలు రకాలైన పరీక్షలు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు తేలింది. కాగా, ఆయన్ను సోమవారం డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.