ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (12:56 IST)

పదో తరగతి పరీక్షల్లో వీణ, వాణి టాపర్స్

అవిభక్త కవలలు వీణ, వాణీలు పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ప్రతిభ చాటారు. మార్చి నెలలో జరిగిన మూడు పరీక్షలకు వీరు హాజరయ్యారు.

హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభ హైస్కూల్‌లో వేర్వేరు హాల్ టికెట్లతో ఇరువురూ పరీక్షలు రాశారు. అనంత‌రం కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. విద్యార్థులు అందరూ పాస్ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. పరీక్షల సమయంలో వీరిద్దరినీ ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.

మరోవైపు ఇంటర్‌లో ఎంఈసీ కోర్సులో చేరేందుకు ఇద్దరూ ఆసక్తిని కనబరుస్తున్న‌ట్లు త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు.