బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (17:30 IST)

కేసీఆర్ చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి..?: విజయశాంతి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి అని సినీ నటి, బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా త‌నిఖీ చేస్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌బోర‌న్నారు. 
 
సీఎం గారు సెక్రెటేరియట్ వెళ్లి చూస్తే కూల్చివేత.... ప్రగతి భవన్‌కు పంపితే పక్క భవనాల కూల్చివేత... వరంగల్‌కు వెళితే జైలు కూల్చివేత.... ఇప్పుడు జిల్లాలలో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయ్' అని విజయశాంతి విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.
 
తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులకు విజయశాంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని... తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారు.
 
సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు. ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే, అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. వస్తున్నా వస్తున్నా అనడమే గాని... ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైంది. 
 
సాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్లీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. నెలన్నర దాటినా అతి గతీ లేదు. అంతకు ముందు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు వచ్చి 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు... ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడు' అంటూ విజ‌య‌శాంతి విమర్శించారు.