యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు...  
                                       
                  
                  				  తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి ఆలయంలో తిరుమల తిరుపతి తరహా బ్రేక్ దర్శనాలు నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంట  నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. 
				  											
																													
									  
	 
	ఇదిలావుంటే, కార్తీక మాసం తలి సోమవారం సందర్భంగా టిక్కెట్లు తీసుకున్న 292 మంది భక్తులు ఈ టిక్కెట్లు తీసుకున్నారు. వీరి ద్వారా ఆలయానికి 87,600 రూపాయల ఆదాయం వచ్చింది. 
				  
	 
	అలాగే, కార్తీక తొలి సోమవారం సందర్భంగా సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. వీటి ద్వారా రూ.2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు గ్రహణం వీడనుంది.