శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:40 IST)

సిరిసిల్లను కాపీ కొట్టాలని చెప్పా.. హరీష్ :: మీ టౌన్‌ కంటే బాగున్నయా బావా... కేటీఆర్

సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. ఒకరి పనితీరును మరొకరు కొనియాడారు. అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్

సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. ఒకరి పనితీరును మరొకరు కొనియాడారు. అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టంచేశారు. మరో 15 ఏండ్లు సీఎంగా కేసీఆర్ ఉండాలనేదే తమ కోరికని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం సైనికుల్లా పనిచేస్తామని పేర్కొన్నారు.
 
గురువారం బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా హరీష్ తనలో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
"సిరిసిల్ల టౌన్‌లో రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ చూసి మా మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సుకు ఫోన్‌ చేసి.. చూసి నేర్చుకోండయ్యా.. మనం సిరిసిల్లను కాపీ కొట్టాలని చెప్పా" అని హరీశ్‌ అనడంతో 'మీ టౌన్‌ కంటే బాగున్నయా బావా' అని కేటీఆర్ నవ్వుతూ అనడంతో సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ నవ్వుల్లో మునిగిపోయారు. 
 
ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మంత్రి హరీశ్‌రావు, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. సిరిసిల్ల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామన్నారు. ఉద్యమకాలం నుంచి తెలంగాణ కోసమే పనిచేసిన తామిద్దరం ఒకే మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం లభించిందని, ఇదంతా ప్రజలు ఇచ్చిన సువర్ణవకాశంగా భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.