శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (16:00 IST)

ప్రియురాలి ఇంట్లో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతున్నాడన్న విషయాన్ని భార్య గ్రహించింది. అయితే, ఈ వ్యవహారాన్ని మాటలతో తేల్చితే సరిపోదని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించింది. అంతే.. భర్తపై పక్కాగా నిఘా పెట్టింది. ఈ క్రమంలో తాజాగా ప్రియురాలి ఇంట్లో భర్త ఉన్నాడన్న పక్కా సమాచారం తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామ్‌లోని బీట్ బజార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వరంగల్ బీట్ బజార్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కట్టుకున్న భార్య తులసికి తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, భర్త ఇంటికి రాకుండా ఏకంగా ఆ స్త్రీతో సహజీవనం చేయసాగాడు. 
 
ఈ విషయాన్ని తన పుట్టింటివారికి, కుటుంబ సభ్యులకు చెప్పి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ చేసింది. అలాగే, భర్త ప్రియురాలి ఇంట్లో ఉన్న సమయంలో భార్య, ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి పట్టుకున్నారు. ఆ తర్వాత భర్తను చితకబాదిన భార్య.. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చావబాదారు. ఈ వ్యవహారంపై తులసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.