ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (11:15 IST)

ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి చనిపోయిన హెడ్ కానిస్టేబుల్... ఎక్కడ?

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారు. విధి నిర్వహణ కోసం భద్రాచలం వచ్చిన ఆమె.. విధులు ముగించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయారు. 
 
హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి కొత్తగూడెంలో పని చేస్తున్నారు. ఆమ విధులు ముగించుుకుని ఆ తర్వాత భద్రాచలం ఆలయంలోని సీతారాములను దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న అన్నదాన సత్రంలో భోజం చేసేందుకు వెళ్లారు. అయితే, భద్రాచలంలో కురిసిన భారీ వర్షానికి అన్నదానం సత్రం వద్ద ఉన్న మురికి కాలు ఉప్పొంగింది. 
 
ఆ సమయంలో అటుగా వెళుతున్న శ్రీదేవి ప్రమాదవశాస్తు అందులో పడిపోయారు. మహిళా పోలీస్ నాలాలో పడిపోయారంటూ అక్కడున్నవారు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు.. ఆ ప్రాంతమంతా గాలించారు. అయితే, అన్నదాన సత్రానికి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.