శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (15:33 IST)

హైదరాబాదు: రాత్రి పదిగంటలకు యువతి కిడ్నాప్.. గట్టిగా కేకలు పెట్టినా..?

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువతి కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దేవరకొండ బస్తీ రోడ్ నంబర్ 3లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో యువతి తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే కిడ్నాపర్లు ఆమెను తీసుకుని పరారయ్యారు.
 
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇది తెలిసిన వారిప పనేనా? లేక ఏదైనా ముఠా హస్తం ఉందా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.