మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (12:53 IST)

బిడ్డను వేధిస్తున్నాడని.. అల్లుడిని అత్తే హత్య చేసింది.. ఎక్కడ?

బిడ్డను వేధిస్తున్నాడని.. మద్యానికి బానిసైన అల్లుడిని అత్తే హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండలానికి చెందిన ఈరుకి రాములునాయక్ తండాకు చెందిన నరసమ్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు బాగానే ఉన్నా... ఆ తరువాత మద్యానికి బానిసగా మారాడు. ఏ పని చేయక...అత్త చిలుకమ్మ ఇంట్లో గత కొంతకాలంగా ఇల్లరికం ఉంటున్నాడు.
 
రోజూ తాగి రావడమే కాకుండా కొంతకాలం నుంచి వేధింపులకు కూడా గురిచేస్తున్నాడు. ఇది చూసి సహించలేని అత్త చిలుకమ్మ... అల్లుడు నిద్రిస్తుండగా రోకలిబండతో కొట్టింది. తీవ్ర రక్తస్రావమై ఈరు అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే నేరుగా వెళ్లి నర్శంపేట పోలీసుల ఎదుట అత్త చిలుకమ్మ లోంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.