మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (08:46 IST)

వచ్చే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు... ఆరెంజ్ హెచ్చరిక

rain
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం భారీగా బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని తెలిపింది. బుధవారంలోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా. మరోవైపు ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. 
 
వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెండోరా(నిజామాబాద్‌ జిల్లా)లో 1.9, భైంసా(నిర్మల్‌)లో 1.2, గోధూరు(జగిత్యాల)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 
 
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాండీ ఇకలేరు... 
 
కేరళ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు ఉమెన్ చాండీ ఇకలేరు. సుధీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 యేళ్లు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆయన ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది. ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే ఎన్నిక కావడం గమనార్హం. 
 
2020 సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఆయన ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాండీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నడూ పార్టీ మారలేదు కూడా. 
 
సొంత నియోజకవర్గం పూతుపల్లే తన కార్యక్షేత్రమని.. వీలైనంత వరకు ప్రజల మధ్య ఉండటమే తన విజయ రహస్యమని చాండీ పలుమార్లు వినయంగా చెప్పేవారు. ఎన్ని పనులున్నా.. ఏ హోదాలో ఉన్నా ప్రతి శనివారం రాత్రికి ఆయన పూతుపల్లి చేరుకునేవారు. ఆదివారం అంతా నియోజకవర్గంలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేవారు. ఐదు దశాబ్దాలుగా దాన్ని ఓ నియమంగా పెట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పాటించారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దానికి మినహాయింపు ఉండేది.
 
ప్రజలతో ఈ అవినాభావ సంబంధమే ఆయనను ఆదర్శ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సౌర కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వచ్చినా జనం విశ్వసించలేదు. అప్పట్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా ఓటర్లు ఆయనకు దన్నుగా నిలిచి విజయం కట్టబెట్టారు. ఆయన మృతిపట్ల కేరళ ప్రభుత్వం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.