గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (16:47 IST)

మద్యం మత్తు: స్నేహితుడిని మర్మాంగాన్ని కొరికాడు.. ఆస్పత్రి పాలయ్యాడు..

మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లాలో స్నేహితుడితో కలిసి మద్యం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి మందు నిషా నషాళానికి ఎక్కడంతో ఏం చేశాడో తెలిసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. 
 
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన దారుణానికి అతని స్నేహితుడు ఆసుపత్రి పాలయ్యాడు. అంతే కాదు సంసార సుఖానికి పనికి రాకుండా పోయాడు. 
 
పొడ్చన్‌పల్లి పరిధిలోని ఏడుపాయల కమాన్‌ సమీపంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి ఆల్కహాల్ తాగడానికి ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇద్దరూ కలిసి మందు తాగారు. అయితే తాగిన మందు డోసు మించిపోవడంతో ఇద్దరిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
 
మద్యం మత్తు ఒంటికి ఎక్కడంతో తాగిన తిమ్మిరితో ఒక వ్యక్తి తనతో మద్యం తాగడానికి వచ్చిన స్నేహితుడి మర్మాంగాన్ని కొరికాడు. వెంటనే బాధితుడికి తీవ్రరక్త స్రావం కావడంతో ఆస్పత్రి పాలయ్యాడు.