1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:51 IST)

ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy
YS Avinash Reddy
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. 
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ... మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ఇది ఐదో సారి. ఈసారి ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో.. ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనీ.. సీబీఐ దూకుడు చూస్తుంటే.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.