గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (12:37 IST)

అపోలో నుంచి వైఎస్ షర్మిల వీడియో

ys sharmila health
తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఇబ్బంది పెట్టారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. అపోలో హాస్పిటల్స్ నుండి షర్మిల ఒక వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ఇందులో సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా, యంత్రాంగాన్ని ఉపయోగించి తనను ఇబ్బంది పెట్టడానికి, తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 
 
తన మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ పాలనపై తన పోరాటం కొనసాగిస్తానని, తనతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ, మద్దతుదారులందరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. కేసీఆర్ మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు. 
 
ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, మా కార్యకర్తలను బందీలను చేశారు. తీవ్రంగా కొట్టారు. అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు. ఇకపోతే,  పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.