బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (21:50 IST)

ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. నా జీవితం తెలంగాణకే అంకితం.. షర్మిల

తన జీవితం తెలంగాణకే అంకితమని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలి నాలి చేసి చదివిస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ఏది పండించాలనే హక్కు రైతుకు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. వ్యవసాయంలో అన్ని పథకాలు తీసేసి రూ.5 వేలు ఇస్తున్నారని అన్నారు.
 
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. 
 
మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది.