1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (11:42 IST)

జెనీలియాకు బాబు పుట్టాడోచ్.. Its a BBBOOOOYYYYYY అంటూ ట్వీట్!

జెనీలియాకు బాబు పుట్టాడు. ఈ విషయాన్ని Its a BBBOOOOYYYYYY అంటూ ఆమె భర్త నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించాడు. ముంబైలోని ఓ హాస్పిటల్‌లో జెనీలియా పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చిందని, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉందని రితేష్ తెలిపాడు. 
 
కాగా జెనీలియా నిండు గర్భిణీగా వున్నప్పటికీ హైదరాబాద్‌లో జరిగిన సల్మాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్ళికి వచ్చింది. ఆ సమాయంలో ఆమె కెమెరా కంటపడకుండా జాగ్రత్తపడినా.. ఆమె ఫోటోలు మీడియా కంట పడింది. 
 
2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు. తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. 
 
రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న సంగతి తెలుసుకున్న అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.