శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (13:49 IST)

స్ఫృహ తప్పిన సరిత...! విడాకులు చెల్లవంటూ వాదన..!

అలనాటి అందాల తార సరిత. ఆమె తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు చిత్రాల్లో నటించింది. ఆమె మలయాళ నటుడు ముఖేష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో గత కొంత కాలం క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సరిత నుంచి విడాకులు కోరుతూ ముఖేష్ కోర్టుకెక్కాడు. అది కూడా 2009లో. రెండేళ్ళ క్రితం కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత ముఖేష్, మిధుల అనే మరో అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. 
 
అయితే సరిత ఈ విడాకులు చెల్లవంటూ కోర్టులో పిటిషన్ పెట్టుకుంది. ఈ కేసు విచారణ జరుగుతోంది. చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో గురువారం నాడు ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా సరిత ఆవేశంగా మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఉపచారాలు చేసిన మీదట కోలుకుంది. పెళ్ళి చేసుకుని 20 ఏళ్ళకు పైగా సంసారం చేయడంతోపాటు ఇద్దరు కొడుకులు పెద్దవాళ్ళయిన తర్వాత ఈ జంట విడిపోవాల్సి వచ్చింది. తన భర్తకు - తనకు మంజూరైన విడాకులు ఏకపక్షంగా వచ్చినవని సరిత వాదిస్తోంది. 
 
కోర్టు విడాకులు మంజూరు చేసిన సమయంలో తాను కోర్టుకు హాజరు కాలేదని, ఆ సమయంలో విదేశాలలో ఉన్న తాను తిరిగి వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్‌ అందించారని సరిత ఆవేదన వ్యక్తంచేసింది. కనుక ఈ విడాకులు చెల్లవని సరిత వాదనని వినిపిస్తోంది.