1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (14:44 IST)

రోడ్డు ప్రమాదంలో సినీ నటి శారదకు స్వల్ప గాయాలు.. హారిసన్‌కు కూడా..

రోడ్డు ప్రమాదంలో సినీనటి శారదకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయింది. ఈ ఘటలో శారదకు స్వలంగా గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
హైదరాబాదులో జరుగుతోన్న సినిమా షూటింగులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారుకు ఒక్కసారిగా గేదెలు అడ్డురావడంతో, కారును పక్కకు తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
 
కాగా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన చిన్న విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు సీట్లున్న చిన్న విమానాన్ని తానే నడుపుకుంటూ వెళ్లి ఆయన స్థానిక ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేస్తున్న సమయంలో గోల్ఫ్ కోర్టులో విమానం క్రాష్ అయింది.

దీంతో ఫోర్డ్ తలకు బలమైన గాయాలైనట్టు, చికిత్స కోసం వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు అక్కడి పోలీస్ విభాగ ప్రతినిధి మహిళా అధికారి వివరించారు. 
 
మెకానికల్ విఫలం వల్లనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. 'ఇండియానా జోన్స్' చిత్రం ద్వారా హాలీవుడ్ లో పాప్యులారిటీ సంపాదించుకున్న హారిసన్ పలు సినిమాల్లో నటించారు.