శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 24 జులై 2014 (20:03 IST)

లండన్‌ చుట్టిన 'అదిరింది అలెక్స్‌'

జై ఆకాష్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అదిరింది అలెక్స్‌'. షూటింగ్‌ జూన్‌ 27న లండన్‌లో ప్రారంభమై ఈనెల 18వరకు మొదటి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర విశేషాలను జైఆకాష్‌ తెలుపుతూ... మిస్టర్‌ రాజేష్‌ చిత్రం తర్వాత ఈ బేనర్‌లో చేస్తున్న రెండవ సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ లండన్‌, ప్యారీస్‌లలో ఇప్పటివరకు చూడని ప్రదేశాల్లో చిత్రించాం. ఇందులో సిబిసిఐడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రంద్వారా ఎమిలీ జాక్సన్‌, హాలీ జాన్సన్‌, సెజ్జల్‌ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇప్పటివరకు యాభై శాతం షూటింగ్‌ పూర్తయింది. రెండవ షెడ్యూల్‌ వచ్చేనెల 2నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తామని' తెలిపారు. 
 
నిర్మాత ఖాదర్‌వల్లి మాట్లాడుతూ... మిస్టర్‌ రాజేష్‌ మంచి లాభాలు రావడంతో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ చిత్ర ఆడియోను ఆగస్టులోనూ, సినిమాను సెప్టెంబర్‌లోనూ విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌, సైరన్‌, సంగీతం: యు.కె. మురళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై ఆకాష్‌, మాటలు: అభిలాష్‌ అవిరినేని.