''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి రేటింగ్స్ అదుర్స్... నాగ్ ఫుల్ హ్యాపీ!

Nagarjuna
Ganesh| Last Updated: సోమవారం, 23 జూన్ 2014 (15:40 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ చేసిన ''కౌన్ బనేగా కరోడ్ పతి" టీవీ షోకు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. అయితే ఆ టీవీ షో తెలుగులో "మీలో ఎవరు కోటీశ్వరుడు" పేరుతో కింగ్ నాగార్జున చేస్తున్నారు. ఈ షో ఈనెల ప్రథమార్ధం నుంచి మాటీవీలో ప్రసారమవుతోంది. ఇప్పుడిషో అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఈ షోకి అదిరిపోయే రేటింగ్స్ వస్తున్నాయని మా టీవీ ప్రకటించింది. ప్రస్తుతం వస్తోన్న అన్ని తెలుగు కార్యక్రమాలకంటే ఈ షో రేటింగుల్లో దూసుకుపోతోంది. గత వారం ఈ కార్యక్రమం అత్యధికంగా స్థూల రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. 9.7 టెలివిజన్ వ్యూయర్ రేటింగ్ (టీవీఆర్) పాయింట్లు లభించాయి. మా టీవీలో వస్తోన్న ఈ షో గంటన్నరపాటు ఉంటుంది. గత రెండేళ్లలో ఈ స్థాయిలో రేటింగులు వచ్చిన కార్యక్రమం మరేదీ లేదని మా టీవీ ప్రకటించింది.
దీనిపై మరింత చదవండి :