శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:07 IST)

ఆయనతో జాగ్రత్త.. అప్పుడు సుహాసినీ.. సుమలత వివాదాస్పద వ్యాఖ్య..!

కన్నడ సినీ హీరో, మంత్రి అంబరీష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన భార్య సుమలతనే ఆయన గురుంచి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చి వివాహాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనతో జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమలోని వ్యక్తులు ఆనాడే హెచ్చరించారని గుర్తు చేసుకున్నారు. సుమలత -  అంబరీష్ వివాహం జరిగి పాతికేళ్ళు అయిన సందర్భంగా చాలా విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలని సుమలత వెల్లడించారు.
 
అంబరీష్ , సుమలత తెలుగు తెరకు, తమిళ తెరకు బాగా పరిచయస్తులే. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, అంబరీష్ తో జాగ్రత్తగా ఉండాలని తనని హెచ్చరించారని సుమలత వెల్లడించారు. అలా చెప్పిన వారిలో నటి సుహాసిని తో పాటు కొంతమంది ఉన్నారని చెప్పుకోచ్చారు.
 
ఓ ఇంటర్వ్యూలో సుమలత తన గతాన్ని నేమరేసుకుంటూనే, తన వివాహానికి సంబంధించిన విశాయలను వెల్లడించారు. చివరకు మేకప్ మాన్ కూడా అంబరీష్ కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారని తెలియచేశారు. కానీ అంబరీష్ తనకు నచ్చడంతో ఆయనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటికీ తమ దాంపత్య జీవితం ఎలాంటి ఓడిదుకులు లేకుండా హాయిగానే సాగుతుందని సుమలత తెలిపారు.