శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:46 IST)

'మనం'లో అమితాబ్‌ నటించారు.. అందుకే.. గౌరవంగా...

దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత.. దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద జాతీయ అవార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2004 నుంచి దేశంలోని సినిమా రంగంలో సేవలు అందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. అయితే తాజాగా 2013కు గానూ అక్కినేని జాతీయ అవార్డుకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అక్కినేని జాతీయ అవార్డు  ఛైర్మన్‌ సుబ్బిరామి రెడ్డి శనివారం తెలిపారు. 
 
అన్నపూర్ణ 7ఎకర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, నాగసుశీలతో పాటు సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వర్‌ రావు తను లేకపోయినా అతని పేరుమీద ఓ జాతీయ అవార్డు నెలకొల్పి.. సినిమా రంగంలో విశేష కృషి చేస్తున్న వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు అప్పట్లోనే కోటి రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు. 2004 నుంచి ఈ అవార్డును ప్రతి ఏటా ప్రదానం చేస్తున్నాం. 2013కు గానూ అమితాబ్‌గారికి అక్కినేని జాతీయ అవార్డును ఇవ్వాలని నిర్ణయించాం. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమానికి చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం' అని తెలిపారు. 
 
నాగార్జున మాట్లాడుతూ..'నాన్న గారు మా మీద ఓ బాధ్యత పెట్టాడు. మేము కూడా అంతే బాధ్యతగా ఫీలవుతున్నాం. అయితే నాన్న గారు చనిపోవడం వల్ల 2013 అవార్డుకు ఎంపిక చేయడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు అమితాబ్‌ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ వార్త విని రావడానికి వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో విశేషమేమంటే.. నాన్నగారు నటించిన చివరి సినిమా 'మనం'లో అమితాబ్‌ నటించారు. ఈ అవార్డు ప్రదానం ఈ నెల 27న జరుగుతుంది. 
 
దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరవుతున్నారు. ఈ సారి అవార్డు ప్రదాన వేడుకను ఘనంగా నిర్వహించాలనుకున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటి శోభన డాన్స్‌లతో పాటు పలు కల్చరల్‌ ఈవెంట్స్‌ కూడా ఉంటాయి' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ సుశీల పాల్గొని నాన్న పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.