శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (12:41 IST)

సూర్య ''మాస్'' నుంచి ఎమీ జాక్సన్ అవుట్.. ప్రణీత ఇన్!

సూర్య హీరోగా నటిస్తున్న ''మాస్'' సినిమా నుంచి ఎమీ జాక్సన్ తప్పుకుంది. మాస్ నుంచి ఎమీ జాక్సన్ డ్రాప్ అయిందంటూ ఇటీవల వార్తలు రావడం ... వెంటనే యూనిట్ వాళ్ళు దానిని ఖండించినప్పటికీ.. ఈ వార్తలను నిజం చేస్తూ ఆ ప్రాజెక్టుకి ఎమీ బై చెప్పేసింది. 
 
దీంతో 'అత్తారింటికి దారేది' ఫేం ప్రణీత పంట పండింది. ఆ కథానాయిక పాత్రకు వెంటనే ఈ ముద్దుగుమ్మను ఫిక్స్ చేశారు. త్వరలో బల్గేరియాలో జరిగే షూటింగులో ప్రణీత జాయిన్ అవుతుందని సమాచారం. 
 
తమిళంలో మంచి ఆఫర్ల కోసం చూస్తున్న ఈ కన్నడ కస్తూరికి ఇది మంచి ఛాన్సే. 'బిరియానీ' ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో హారర్ ఫ్యాంటసీగా ఇది రూపొందుతోంది. ఇందులో మరో కథానాయికగా నయనతార నటిస్తోంది.