శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (15:50 IST)

నేను గర్వపడే సినిమా రుద్రమదేవి... అనుష్క

పదేళ్ళనుంచి ఇండస్ట్రీలో ఏదో కొత్త ప్రయోగం చేయాలని ఎదురుచూస్తున్నాను. అది రుద్రమదేవితో నెరవేరింది. ఈ చిత్రంలో చేసినందుకు గర్వపడుతున్నానని అనుష్క తెలిపింది. గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శకనిర్మాతగా రూపొందుతున్న హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి సంబంధించిన 3డి థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ను హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హీరోయిన్‌ అనుష్క లాంచ్‌ చేశారు. 


 
ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ... ట్రైలర్‌ అద్భుతంగా వుంది. సైనికులంతా ఈగిల్‌ షేప్‌లో చేసిన విధానం అద్భుతంగా వుంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. గుణశేఖర్‌ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. రుద్రమదేవిగా నటించడం నేనెంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన సినిమాలను ఎంతో ఆదరించిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరించి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.