శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:33 IST)

అమెరికా నుంచి "ఐ" హీరోకు ఆహ్వానం: జోష్ మీదున్న స్టార్!

హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ శ్వార్జ్ నెగర్ నుంచి ఆహ్వానం రావడంతో శంకర్ సినిమా ఐ హీరో విక్రమ్ జోష్ మీదున్నాడు. అమెరికాకు వచ్చి తనను కలవాల్సిందిగా ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్న ఆర్నాల్డ్ తన ఆహ్వానంలో విక్రంని కోరాడు. ఇటీవల ఆయన 'ఐ' ఆడియో వేడుకకు ప్రత్యేకంగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే, పని ఒత్తిడి కారణంగా ఆ కార్యక్రమం మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు. దాంతో విక్రంతో ఆయన మాట్లాడలేకపోయాడు. 
 
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు విక్రంని ఆయన అమెరికాకి ఇన్వైట్ చేశాడు. దీంతో విక్రం చాలా హ్యాపీ ఫీలవుతున్నాడట. ఆర్నాల్డ్ ఆహ్వానాన్ని మన్నించిన విక్రం త్వరలోనే అమెరికా వెళ్లి హాలీవుడ్ యాక్షన్ హీరోను కలువనున్నాడని సమాచారం.