శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:41 IST)

ఆర్నాల్డ్ ప్రేరణతోనే విక్రం 'ఐ' తెరకెక్కించా : శంకర్

హాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ ప్రేరణతోనే విక్రంతో "ఐ" చిత్రాన్ని నిర్మించినట్టు కోలీవుడ్ సంచలన దర్శకుడు శంకర్ తెలిపారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' చిత్రంలో హీరో విక్రమ్ బాడీబిల్డర్ పాత్రలో కనిపిస్తాడు. ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ప్రేరణ అని దర్శకుడు వెల్లడించాడు. 
 
"ఈ చిత్రంలో విక్రమ్ బాడీబిల్డర్‌గా 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ కోసం పోటీ పడతాడు. ఈ పాత్ర ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాలంటే... బాడీబిల్డింగ్ లెజెండ్‌గా ఉన్న ఆర్నాల్డ్‌నే గుర్తు తెచ్చుకున్నాం. అలా మేము విక్రం పాత్రను రూపొందించాం" అని శంకర్ వివరించాడు.