1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (11:49 IST)

ప్యారిస్‌లో అసిన్ బర్త్‌డే.. ఇంతకీ సినిమాల్లో నటిస్తుందా?

ప్యారిస్‌లో అసిన్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ అసిన్ సినిమాల్లో నటిస్తుందా ? అనే అనుమానం అభిమానుల్లో తలెత్తింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన అసిన్.. ఏవే నాలుగైదు సినిమాలు నటించి ప్రస్తుతం ప్యారిస్‌కు వెళ్ళిపోయింది. 
 
ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ప్యారిస్‌లో ఉన్న అసిన్ ఆదివారం బర్త్ డే జరుపుకుంది. తన జన్మదిన వేడుకను పారిస్ నగరంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో ఉల్లాసంగా జరుపుకుంటోంది. 
 
అయితే, ఈ కార్యక్రమం కోసమే ఈ ముద్దుగుమ్మ అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళలేదు. గత కొన్నాళ్ళుగా కుటుంబ సభ్యులతో కలసి ఈ చిన్నది యూరప్ పర్యటనలో వుంది. పనిలో పనిగా అసిన్ అక్కడే పుట్టినరోజును జరుపుకుంది.