శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (15:37 IST)

జనవరి నెలలో బి.ఏ.పాస్ చిత్రం విడుదల!

'ది రైల్వే ఆంటీ' అనే పాపులర్‌ షార్ట్‌ స్టోరీ ఆధారంగా హిందీలో రూపొంది, అసాధారణ విజయం సాధించిన చిత్రం 'బి.ఏ.పాస్‌'. రికార్డులతోపాటు అవార్డులు కూడా దండిగా దక్కించుకున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు యువ నిర్మాత ఎం.అచ్చిబాబు. 'మినిమం గ్యారెంటీ మూవీస్‌' (ఎం.జి.ఎం) పతాకంపై, సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ప్రముఖ రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూరుస్తున్నారు. అజయ్‌ చెహల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'చెక్‌ దే ఇండియా' ఫేం శిల్పశుక్ల, షాదాబ్‌ కమల్‌, దివ్యేంద్ర భట్టాచార్య, రాజేష్‌శర్మ ముఖ్యపాత్రలు పోషించారు. అలోక్‌ నందన్‌దాస్‌ గుప్తా సంగీతం అందించారు.
 
ఈ చిత్రం డబ్బింగ్‌ హైద్రాబాద్‌లోని జి.వి.స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సీనియర్‌ నటులు చలపతిరావు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్‌.పి.పట్నాయక్‌ ముఖ్య అతిధులుగా విచ్చేసి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హిందీలో కంటె తెలుగులో మరింత పెద్ద విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
 
నెలాఖరుకల్లా డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రెస్‌ రిలేషన్స్‌: ధీరజ అప్పాజీ, నిర్వహణ: డి.నారాయణ, సంగీతం: అలోక్‌నంద్‌దాస్‌ గుప్తా, మాటలున వి.ఎస్‌.పి.తెన్నేటి, సమర్పణ: సంపత్‌కుమార్‌, నిర్మాత: ఎం.అచ్చిబాబు, దర్శకత్వం: అజయ్‌ బెహల్‌!