శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:14 IST)

'బాహుబలి': ఫైట్స్ చేస్తున్న రానా.. బల్గేరియాకు జర్నీ!

దగ్గుబాటి రానా 'బాహుబలి'లో విలన్‌గా భళ్లాల దేవుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సర కాలంగా ఈ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా, 'బాహుబలి'లో రానా ఇంట్రడక్షన్ ఫైట్‌ను ఫిలింసిటీలో రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. బుధవారంతో రానా పరిచయ సన్నివేశాలు పూర్తయ్యాయి.
 
తదుపరి షూటింగ్ నిమిత్తం త్వరలో 'బాహుబలి' యూనిట్ బల్గేరియా దేశానికి వెళ్లనుంది. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రమ్యకృష్ణ, సత్యరాజ్, అడవి శేష్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.