శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:57 IST)

బాహుబలి మళ్ళీ వాయిదానా?

ఎప్పుడెప్పుడా అని అటు నటీనటులతో పాటు ప్రేక్షకుల కూడా ఎదురుచూస్తున్న 'బాహుబలి' సినిమా మళ్ళీ వాయిదాపడే సూచనలు కన్పిస్తున్నట్టు టాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌‌కి సంబంధించిన టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయ్యింది. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మాత్రమే మిగిలివున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం రాత్రింబవళ్ళు ఈ సినిమాని అనుకున్న టైం కి ఫినిష్‌ చెయ్యడానికి వర్క్‌ చేస్తున్నారు.
 
ఈ సినిమాని మే 15న రిలీజ్‌ చేయనున్నామని నిర్మాతలతో పాటు దర్శకుడు రాజమౌళి తెలిపారు. అయితే టెక్నికల్‌గా చాలా గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండటంతో.. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కల్పిత కథ కాబట్టి ఇంకా టైం పడుతుందని టెక్నీషియన్స్‌ తెలియజేసినట్లు సమాచారం. జూన్‌లో ఆ పనులు పూర్తవుతాయని, జులైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకోవచ్చని తెలిసింది. ఇండియా, హాంక్‌ కాంగ్‌, యుఎస్‌‌కి చెందిన 6 విఎఫ్‌ఎక్స్‌ టీమ్స్‌ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. 
---