శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 27 మే 2015 (19:28 IST)

పదిట్రాక్‌లతో బయటకువస్తున్న బాహుబలి (ది బిగినింగ్) సాంగ్స్

ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బాహుబలి'. (ది బిగినింగ్‌) అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం ఫస్ట్‌లుక్‌లు ఒక్కొక్కటిగా ఇప్పటివరకు బయటకు తీసుకువచ్చారు. ఈ నెల 31న ఆడియోను, ట్రైలర్స్‌ను విడుదల చేయడానికి హైటెక్‌గ్రౌండ్‌ వేదికగా చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు వస్తున్నారంటూ.. ఎవ్వరూ రావడం లేదంటూ.. రకరకాలుగా వార్తలు వచ్చాయి.
 
అయితే ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథులు ఎవ్వరూ లేరంటూ.. చిత్రయూనిట్‌ సభ్యులే పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆడియో ట్రాక్‌ లిస్ట్‌ బయటకు వచ్చింది. ఇందులో మొత్తం 10 ట్రాక్‌లు వుంటాయి. 3 థీమ్ సాంగ్స్‌, 6 పాటలు నిడివి తక్కువలో వుంటాయి. ఒకటి ఫుల్‌లెంగ్త్‌ పాట వుంటుంది. ఆడియో ట్రాక్స్‌లో.. విన్నావయ్యా, నిన్ను చూడకుండా.. ఓ శివుడా, ఇది ప్రేమేనా యుద్ధం (థీమ్‌1), ఇది ప్రేమేనా, యుద్థం (థీమ్‌2), రా రా బలి.. ఓ బాహుబలి(థీమ్‌), అవంతిక అవంతిక, యుద్థం (థీమ్‌3) వున్నాయని తెలుస్తోంది.