శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (12:37 IST)

సినీ రాజకీయాలను ఎప్పుడూ పట్టించుకోను.. 'మా' ఎన్నికలపై బాలయ్య..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను సినీ రాజకీయాలను ఎప్పుడూ పట్టించుకోనని తెలిపారు.
 
అయితే ఈ ఎన్నికల్లో గెలుపొందిన రాజేంద్ర ప్రసాద్ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న నటీ నటులకు సహాయం చేయాలని కోరారు. కాగా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.