శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (22:08 IST)

బాలయ్య చిత్రం టైటిల్‌ మార్చేసినట్లే!

'లెజెండ్‌' చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి టైటిల్‌ను లయన్‌, వారియర్‌ అని పెట్టడానికి నిర్ణయించారు. అయితే ఛాంబర్‌లో లయన్‌ టైటిల్‌ కోసం వెళ్ళగా... అప్పటికే తెలంగాణ ఛాంబర్‌లో ఓ నిర్మాత ఈ టైటిల్‌ను రిజిష్టర్‌ చేసినట్లు తెలిసింది. దాంతో ఈ టైటిల్‌ను మార్చేసే సూచనలు కన్పిస్తున్నాయి. 
 
ఇటీవల పెద్ద హీరోల చిత్ర టైటిల్స్‌కు ఓ వ్యాపారంలా మారిందని ఇండస్ట్రీ భావిస్తోంది. ముందుగానే ఎవరో ద్వారా తెలుసుకుని టైటిల్స్‌ రిజిష్టర్స్‌ చేయించడం పరిపాటి అయింది. అయితే సెంటిమెంట్‌ పరంగా లయన్‌ పెట్టాలని వున్నా.. వారియర్‌ అనేది యుద్ధ వాతావరణంలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ నెల 31కి ఫస్ట్‌లుక్‌ను బాలయ్య విడుదల చేయమని నిర్మాతదర్శకులకు సిగ్నల్‌ ఇచ్చారు. తెలుగుదేశం నాయకుడు రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.