శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (21:53 IST)

బందిపోటు అంటే భయమట...!

అల్లరి నరేష్‌ తన తండ్రి పేరుతో ఇవివి బేనర్‌ను స్థాపించి నిర్మాతగా సోదరుడు ఆర్యన్‌ రాజేష్‌ను పెట్టి తీస్తున్న సినిమా 'బందిపోటు'. ఈ సినిమాకు గతంలో ఎన్‌టిఆర్‌ పేరుపెట్టారు. కానీ ఆ చిత్రానికి ఈ చిత్రానికి సంబంధమే వుండదని చెబుతూ... ఏమాత్రం తేడా చేసినా... ఆ పేరును చెడగొట్టిన వాడినవవుతాననే భయపడ్డాననీ, కానీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ చేస్తున్న విధానం చూశాక ధైర్యం వచ్చిందని అంటున్నాడు.
 
ఇటీవలే 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' లోబడ్జెట్‌తో తీసి.. మంచి విజయాన్ని చేకూర్చిన ఉత్సాహంతో బందిపోటుపై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ పాటను ఇటలీ తీస్తున్నాడు. ఇదేమని అడిగితే... నేను బయట చిత్రాలు చేస్తే విదేశాల్లో పాటలు కావాలా? అదే స్వంత సినిమా అయితే ఇక్కడే తీస్తారా అనే అపప్రద నాకొద్దు.. అందుకే అక్కడ తీస్తున్నానని నిజాన్ని చెప్పేశాడు.