10 నుంచి ఎన్టీఆర్‌-పూరి జగన్నాథ్‌-బండ్ల గణేష్‌ల భారీ చిత్రం

puri - ntr - bandla
PNR| Last Updated: గురువారం, 4 సెప్టెంబరు 2014 (18:30 IST)
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.5 చిత్రం రెండో షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 10న ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ .. ''ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 10న ప్రారంభమవుతోంది. ఈ షెడ్యూల్‌ సినిమా టోటల్‌గా పూర్తయ్యే వరకు జరుగుతుంది. హైదరాబాద్‌, వైజాగ్‌లతో పాటు విదేశాల్లో కూడా చిత్రీకరణ వుంటుంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేస్తున్న డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ ఇది. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌-దేవిశ్రీప్రసాద్‌ కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌కి, పూరి జగన్నాథ్‌గారి కెరీర్‌కి, మా బేనర్‌కి ఇది ప్రతిష్టాత్మక మూవీ అవుతుంది'' అన్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.దీనిపై మరింత చదవండి :