శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:21 IST)

గోవు లాగే చేపలు కూడా పవిత్రమైనవి.. తినకూడదు.. కమల్ సంచలన వ్యాఖ్య..!

గోవు మాంసాన్ని తినరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై విశ్వనాయకుడు కమల్ హాస్పన్ స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ... ఒక్క గోవునే కాదు, ఆ మాటకొస్తే ఏ జంతువుని చంపి తినకూడదు అని, చివరికి చేపలని కూడా తినకూడదు అని వ్యాఖ్యానించారు.
 
ఎందుకంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణునే మత్స్యావతారం ఎత్తాడని గుర్తుచేశారు. కనుక గోవు లాగానే చేపలు కూడా పవిత్రమైనవి అని ఆయన అన్నారు. ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు చేపలు తింటున్నారని, కొన్ని శతాబ్దాల క్రితం బ్రాహ్మణులూ ఆవు మాంసాన్ని తినేవారని మన హిందూ పురాతన గ్రంధాలలో ఉన్నదని కమల్ తెలిపారు.
 
అయితే మాంసాహారం తినాలా, లేక శాఖాహారం తినాలా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తానైనా, తన ఆరోగ్య కారణాల వలన ఆవు మాంసం తినడం లేదని అన్నారు. ఇక కమల్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో వేచి చూడాలి.