శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 జులై 2014 (14:56 IST)

రేసు గుర్రం అల్లు అర్జున్‌ను గట్టిగా పట్టుకున్న బోయపాటి శ్రీను!

లెజండ్ సూపర్ హిట్ కావడంతో బోయపాటి శ్రీను తర్వాత హీరోల వేట ప్రారంభించాడు. కొంతకాలం మహేష్ బాబు, ఆ తర్వాత రామ్ చరణ్ తేజతో సినిమాలు చేస్తారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. అయితే అవేమీ వర్కవుట్ కాకపోవడంతో రేసుగుర్రం హీరో అల్లు అర్జున్ గట్టిగా పట్టుకున్నాడు. ఇక అల్లు అర్జున్ వదులుకుంటే లాభం లేదనుకున్న బోయపాటి... ఇప్పటికే కథ వినిపించేశాడట. ఈ కథ కాస్తా అల్లు అర్జున్‌కు బాగా నచ్చేయడంతో బన్నీ వెంటనే డేట్స్ ఇచ్చేశాడని టాక్ వస్తోంది. 
 
'రేసుగుర్రం'గా వసూళ్ల పరుగు చేసిన అల్లు అర్జున్‌... ఈ సినిమా విడుదలకు ముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డిగా అవతారమెత్తబోతున్నాడు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లువారి కుర్రాడు అంగీకరించాడట. 
 
గోన గన్నారెడ్డి పాత్ర డిమాండ్ మేరకు బాడీ లాంగ్వేజ్ మార్చుకోవటం, సిక్స్ ప్యాక్ చేయటం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కత్తి ఫైట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఎందుకూ అంటే...తాను తాజాగా నటిస్తానని కమిటైన గుణశేఖర్ చారిత్రిక చిత్రం రుద్రమదేవి కోసం అని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మీద తీసే యాక్షన్ సన్నివేశం సినిమాకు హైలెట్ అయ్యి నిలుస్తుందని చెప్తున్నారు.