శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2014 (17:18 IST)

10 సెంచరీలకు మరో 4 అడుగులే... బ్రహ్మీ గిన్నిస్ రికార్డ్....

ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఎక్కడ ఏ షూటింగ్‌ జరిగినా.. ముందుగా బ్రహ్మానందం గురించి అక్కడ చర్చించుకుంటున్నారు.. బ్రహ్మానందం లేకపోతే.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏమయిపోయేది? ప్రేక్షకులకు కామెడీ ఎలా? అంటూ సెటైరిక్‌ వార్తలు విన్పిస్తున్నాయి. అరగుండు బ్రహ్మానందం నుంచి ఇప్పుడు బ్రహ్మి స్థాయికి చేరిన బ్రహ్మానందంను ప్రతి హీరో కోరుకుంటున్నాడు. దాంతో దర్శకనిర్మాతలు కూడా తప్పనిసరిగా పెడుతున్నారు. 
 
కొన్ని సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు పెద్దగా రెస్పాన్స్‌ రాకపోయినా.. మరో సినిమాలో ఏదోవిధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఇందుకు తన పారితోషికాన్ని భారీగానే తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలైన రభస, ఆగడు, లౌక్యం వంటివాటిల్లో బ్రహ్మీపాత్రే కీలకం. హీరో పాత్ర నామమాత్రమే. అందుకే బ్రహ్మీని హైలైట్‌ చేస్తూ రచయితలు రాసేస్తున్నారు. 
 
ఇందుకు బ్రహ్మి కూడా రచయితలకు సూచనలిస్తున్నాడు. ఇంకా నాలుగు చిత్రాల్లో నటిస్తే దాదాపు 1000 సినిమాలు పూర్తవుతాయి. దీంతో గిన్నిస్‌బుక్‌లో ఎక్కే అవకాశం వుంది. ఇప్పటికే దాని గురించి తీవ్ర కృషి చేస్తున్నానని బ్రహ్మి చెప్పాడు. మరి 1000 చిత్రాలు తర్వాత ఆయన కెరీర్‌ను ఎలా మలచుకుంటాడో చూడాలి.