1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:23 IST)

బ్రహ్మానందం డబుల్ రోల్... తొమ్మిదేళ్ల బాలుడిగానూ..!

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం చేసే ప్రతి క్యారెక్టర్‌ నవ్వులు పూయిస్తుంది. ఈ సారి ఆయన అభిమానులను పొట్టలు చెక్కలు చేసేలా నవ్వించనున్నారు. ఆయన తాజా చిత్రంలో వెరైటీగా ద్విపాత్రాభినయంలో నటించనున్నారు. అందుకే ఈ సారి వెరైటీగా ట్రై చేశారు. ఎవరూ ఊహించని విధంగా బ్రహ్మానందం తొమ్మిదేళ్ల బాలుడిగా కనిపించనున్నట్లు సమాచారం. 
 
శ్రీకాంత్, సోనియా మన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ''ఢీ అంటే ఢీ'' అనే చిత్రం కోసం బ్రహ్మి బాలనటుడిగా, తండ్రిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఛోటా భీమ్‌గా బ్రహ్మానందం తెగ నవ్వించేస్తారని చిత్ర యూనిట్ ధీమాగా వ్యక్తంచేస్తోంది. ఈ సినిమాకు బ్రహ్మ కామెడీనే హైలైట్ అవుతుందట. 
 
మే ఒకటో తేదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న చిత్ర యూనిట్ తెలిపింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ స్కూల్ టీచర్‌గా నటించారు. కాగా ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్, ఎడిటింగ్ బాధ్యతలను గౌతంరాజు చేపట్టారు.