శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (14:11 IST)

చరణ్ సినిమాలో బ్రహ్మీ ఉన్నారు... గోపి మోహన్ ట్వీట్..!

దక్షిణాది చిత్ర సీమలో మరెక్కడా లేనంతగా టాలీవుడ్‌లో మాత్రమే హాస్య నటులు అధికంగా ఉన్నారు. ఇంతటి పోటీలోను తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్న హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన ఉన్నాడంటే ఆ సినిమా తప్పకుండా హాస్యపరంగా హిట్టు గ్యారెంటీ.
 
ఇక అసలు విషయానికి వస్తే.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం ఉన్నారంటూ రచయిత గోపి మోహన్ వెల్లడించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రంలో హాస్యనటుడు బ్రహ్మానందం లేడు... అంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా బ్రహ్మానందంకే వెళ్లిపోతోందన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో నుంచి ఆయన్ని తప్పించారంటూ పలు రకాల వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఇందులో బ్రహ్మానందం ఉన్నారంటూ చిత్ర రచయితలలో ఒకరైన గోపీమోహన్ స్పష్టం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో నమోదు చేశారు. ఈ సినిమా కొత్త కథ, కథనాలతో తెరకెక్కుతుందని, ఇందులో మా శైలి హాస్యం వుంటుంది. బ్రహ్మానందం పాత్ర కీలకమైనది అంటూ  ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి కోన వెంకట్‌తో కలిసి గోపీ మోహన్ రచన చేస్తున్నారు.