1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:29 IST)

150వ సినిమాలో చిరంజీవి సిక్స్ ప్యాక్: పూరీ సెంటిమెంట్ కోసమే..?

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఎక్కడ చూసిన సిక్స్ ప్యాక్‌మీదే ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరోల నుంటి అగ్ర హీరోల వరకు సిక్స్ ప్యాక్ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. సిక్స్ ప్యాక్ పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఇలా తన అభిమానులను అలరించడం కోసమే, మెగాస్టార్ కూడా తన 150వ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇక ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకుడిగా వ్యవహరించవచ్చుననే వార్తలు సైతం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. దేశముదురు సినిమాలో బన్నీని, టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ని సిక్స్ ప్యాక్‌తో చూపించి ఆయన హిట్ కొట్టాడు. అదే తరహాలో ఈ సినిమాలో ఆయన చిరంజీవిని కూడా చూపించనున్నాడనీ, ఈ మధ్యకాలంలో చిరంజీవి సన్నబడటానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక 150వ సినిమాలో చిరంజీవి సిక్స్ ప్యాక్ కనిపిస్తారో లేదా అనేది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.