శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (20:38 IST)

రాంగోపాల్ వర్మ దేవుళ్ల విభజన... వర్మపై కేసుకు కోర్టు ఆదేశం

ఆంధ్రా దేవుడైన తిరుమల బాలాజీని తెలంగాణ ప్రజలు ఎక్కువగా కొలుస్తున్నారంటూ దేవుళ్ల విషయంలో వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో గోవర్థన్ రెడ్డి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు వర్మపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. ఇదిలావుంటే రామ్‌గోపాల్ వర్మ మైండ్.. మోకాలు లోకి కాదు ఏకంగా అరికాలులోకి జారిందంటూ కొందరు సెటైర్లు విసురుతున్నారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే.. ఆయన తాజాగా ట్విట్లర్లో చేసిన కామెంట్లు చూసి నిర్ధారించుకోవచ్చని అంటున్నారు. 
 
రామ్‌గోపాల్ వర్మ దేవుళ్ళకి కూడా ప్రాంతీయ భేదం అంటగట్టే ప్రయత్నం చేశారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదని అంటూనే, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహుడి కంటే ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరుడిని పూజించడం సరైనదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరుపతి బాలాజీని పూజించడం యాదగిరి నరసింహుడికి అవమానమేనని తాను భావిస్తానని వర్మ కామెంట్ చేశారు. మనం సొంత దేశాన్ని ప్రేమించినట్టుగా సొంత దేవుళ్ళని పూజించాలే గానీ పొరుగు రాష్ట్రాల దేవుళ్ళని కాదంటూ సెలవిచ్చారు. తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహుడి కంటే వేంకటేశ్వరస్వామిని ఎక్కువగా తలచుకుంటారని అనడం తప్పుకాదు కదా అని తెలివిగా ప్రశ్నించారు.
 
పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకాలానికి యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, దీంతో తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను తెలుసుకుంటారని తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ పోస్ట్ చేశాడు.